హైదరాబాద్, మార్చి 8 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్రెడ్డి 39వ సారి వెళ్లాల్సిన ఢిల్లీ పర్యటన రద్దయింది. ఆదివారం ఉదయం ఢిల్లీకి వెళ్లాల్సిన సీఎంకు ఏఐసీసీ పెద్దలు ఫోన్ చేసినట్టు తెలుస్తున్నది.
ఢిల్లీకి ఎవరూ రావొద్దని తేల్చిచెప్పినట్టు సమాచారం. హైకమాండ్ ఆదేశించడంతోనే సీఎం తన పర్యటనను రద్దు చేసుకున్నారని తెలిసింది.