Revanth Reddy | హైదరాబాద్ , మే 6 (నమస్తే తెలంగాణ): ఆయన ఓ బీజేపీ నేత. కేంద్ర జల్‌శక్తి శాఖ మాజీ సలహాదారు. ఎన్‌డబ్ల్యూడీఏ నదుల అనుసంధానం ప్రాజెక్టుల టాస్‌ఫోర్స్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. కేంద్రంలోని ఎన్డీయే సరారులో నిన్నమొన్నటి వరకు కీలకంగా పనిచేశారు. అటు సీడబ్ల్యూసీలో, ఇటు కేంద్ర జల్‌శక్తి శాఖలోనూ చక్రం తిప్పారు. కానీ, ప్రస్తుతం ఆయనకు ఏ హోదా లేదని సీడబ్ల్యూసీ అధికారులే వెల్లడిస్తున్నారు. కానీ, ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఈ సమావేశంలో నీటిపారు దల శాఖ మంత్రిఉత్తమ్కుమార్రెడ్డి కూడా పాల్గొన్నారు. ఇరిగేషన్ శాఖ అధికారులను కూడా పకన పెట్టి మరీ ఆయనతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నది.
మేడిగడ్డపై ఎన్డీఎస్ఏ నివేదిక ఇవ్వడంతోపాటు, త్వరలోనే కాళేశ్వరం కమిషన్ కూడా తన నివేదికను సమర్పిచేందుకు సిద్ధమవుతున్న తరుణంలో వారివురి భేటీ చ ర్చనీయాంశంగా మారింది. దాదాపు గంటకుపైగా వెదిరె శ్రీరామ్‌తో సీఎం రహస్య మంతనాలు సాగించారని సమాచారం. వాస్తవంగా ఇరిగేషన్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్ష నిర్వహిస్తారని ఈఎన్సీతోపాటు ఇతర ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ప్రధానంగా ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) సమర్పించిన నివేదిక పై చర్చ ఉంటుందని సీఎంవో వర్గాలు వెల్లడించినట్టు తెలిసింది. దీంతో రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు అందరూ మంగళవారం మధ్యాహ్నం కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు తరలివెళ్లారు. అయితే సాయంత్రం నాలుగు గంటల వరకు ఇరిగేషన్ శాఖ అధికారుల కు ముఖ్యమంత్రి సమయమివ్వలేదు.
ముఖ్యమంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించడం లేదని, బుధవారం జలసౌధలోనే ప్ర త్యేక సమీక్ష నిర్వహిస్తారని చెప్పి సీఎంవో అధికారులు ఇరిగేష న్ శాఖ అధికారులను తిప్పిపంపినట్టు విశ్వసనీయ సమాచారం. అకడి వ ర కు బాగానే ఉన్నా, ఇరిగేష న్ శాఖ ఉన్నతాధికారులను కలువని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాత్రం ఏ హోదాలో లేని కేంద్ర జ ల్శక్తి ్తశాఖ మాజీ సలహాదారు వెదిరె శ్రీ రాంతో భేటీ కావడం చర్చ నీయాంశంగా మారింది. దాదాపు గంటకుపై రహస్య మంతనాలు సాగించారని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్డీఎస్ఏ నివేదిక పై చర్చించినట్టు తెలుస్తున్నది. ఇప్పటికే అది ఎన్డీఎస్ఏ నివేదిక కాదని, ఎన్డీయే నివేదిక అని బీఆర్ఎస్ విమర్శిస్తున్నది. అదే స మ యంలో బీజేపీ సరారులో కీల కంగా పనిచేసిన వెదిరె, అదే కాళేశ్వరం ప్రాజెక్టుపై పదేపదే ఆరోపణలు చేస్తున్న ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి భేటీ కావడం ప్రాధాన్యం సంత రించుకున్నది. అందులోనూ ఇరిగేషన్ శాఖకు చెందిన అధికారులు ఎవరూ లేకుండా వారు మంతనాలు సాగించడం తీవ్ర చ ర్చనీయాంశంగా మారింది.
కాళేశ్వరంపై వెదిరె ఆరోపణలు
కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తరహాలోనే వెదిరె శ్రీరాం సైతం ఆది నుంచీ అనేక ఆరోపణలు చేస్తున్నారు. నిరర్థక ప్రాజెక్టు అంటూ నిరాధార ఆరోప ణ లు చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణకు ఏర్పాటుచేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ ఎదుట కూడా ప్ర త్యేకంగా హాజరై పలు రిపోర్టులను వ్య క్తిగతంగా సమర్పించారు. అయితే ఆ సమయంలో అవ న్నీ నిరాధారమంటూ కమిషన్ కూడా తప్పుబట్టింది. అదే వేరే విష యం. తదుపరి విచారణకు కమిషన్ ఆయనను కనీసం పిలువనూ లేదు. ఇదిలాఉంటే ఇచ్చంపల్లి తన డ్రీమ్ ప్రాజెక్టు అంటూ వెదిరె శ్రీరాం అనేక సందర్భాల్లో బాహాటంగానే వెల్లడించారు. అయితే కేసీఆర్ సరారు ఆ ప్రతిపాదనను పకనపెట్టి మేడగడ్డను నిర్మించింది. దానికి బ్రేకులు వేసింది. ఇక మేడిగడ్డ బరాజ్ ఘటన తరువాత వెదిరె మళ్లీ తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు గత కొంతకాలంగా ప్రచారం జ రుగుతున్నది. గోదావరి కావేరి లింక్ ప్రాజెక్టును అడ్డంపెట్టుకుని ఇచ్చంప ల్లిని తెరమీదకు కూడా తీసుకొచ్చారు. ఇచ్చంప ల్లి వ ద్ద ఎత్తు పెంచి డ్యామ్‌ను నిర్మిస్తే మేడిగడ్డ అవసర ఉండబోదని గత ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో ప్రతిపాదించారు కూడా. ఇప్పుడు కేంద్ర సరారులో కీలకపాత్ర పోషిస్తున్న వెదిరె శ్రీరాం ఇటు ఎన్డీఎస్ఏ నివేదిక రూపకల్పనలోనూ చ క్రం తిప్పినట్టు ఇరిగేషన్ శాఖలో జోరుగా ప్రచారం జరుగుతున్నది. తాజాగా నివేదిక సమర్పించిన అనంతరం ఇప్పుడు వారిరువురు భేటీకావడం రాజకీయ ప్రాధాన్యంను సంతరించుకున్నది.
సీఎం సమీక్ష వాయిదా!
ఇరిగేషన్ శాఖపై సీఎం రేవంత్‌రెడ్డి జలసౌధలో బుధవారం నిర్వహించాల్సిన ప్రత్యేక సమీక్ష సమావేశం కూడా వాయిదాపడినట్టు తెలుస్తున్నది. తొలుత నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఇటీవల రాత పరీక్ష ద్వారా ఎంపికైన 400 మంది ఏఈలు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లకు అపాయింట్మెంట్ లెటర్లను అందించనున్నారు. అనంతరం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ), గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ) చైర్మన్లతో భేటీ అవుతారని, అనంతరం రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాధాన్య ప్రాజెక్టులు, వాటికి నిధుల సమీకరణ వంటి వాటిపై ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ ప్రశాంతజీవన్ పాటిల్ ప్రెజెంటేషన్ ఇస్తారని, తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న నీటి వాటాల సమస్య, నేషనల్ గ్రీన్‌ట్రిబ్యునల్ (ఎన్జీటీ), బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టుల్లో నడుస్తున్న కేసులపై ఇరిగేషన్ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్‌దాస్ సీఎంకు వివరిస్తారని అధికారులు వెల్లడించారు. ఇదే సమావేశంలో ఎన్డీఎస్ఏ రిపోర్టు, మేడిగడ్డ పునరుద్ధరణ, తుమ్మిడిహెట్టి వద్ద ఇరిగేషన్ శాఖ ప్రతిపాదనలపై కూడా సమీక్షించనున్నట్టు ఇరిగేషన్ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు షెడ్యూల్ కూడా ఖరారైంది. అయితే ఈ సమీక్ష కూడా చివ రి నిమిషంలో వాయిదాపడినట్టు తెలుస్తున్నది.
50 ఏండ్ల అవసరాలకు రహదారులు: రేవంత్
వచ్చే 50 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా ట్రిపుల్ఆర్, రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణం, వాటి జంక్షన్లు, అనుసంధానత ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు. రీజినల్ రింగ్ రోడ్డు (సౌత్), రేడియల్ రోడ్లు, ఇతర రహదారుల నిర్మాణంపై జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో మంగళవారం రాత్రి సీఎం సమీక్ష నిర్వహించారు. ట్రిపుల్ఆర్ సౌత్ అలైన్‌మెంట్‌ను పరిశీలించిన ముఖ్యమంత్రి.. పలు మార్పులు సూచించారు. అటవీ ప్రాంతం, జల వనరులు, మండల కేంద్రాలు, గ్రామాల విషయంలో ముందుగానే లైడర్ సర్వే చేపట్టాలని ఆదేశించారు. అలైన్మెంట్ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, పొరపాట్లకు తావివ్వద్దని హెచ్చరించారు.