హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): దేశంలో బీజేపీ పాలిత రాష్ర్టాల కన్నా తెలంగాణలో తమ పాలనే బెటర్ అని సీఎం రేవంత్రెడ్డి ప్రధాని మోదీకి కౌంటర్ ఇచ్చా రు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఆర్థిక వ్యవస్థ దిగజారుతున్నదన్న ప్రధాని మోదీ విమర్శలపై సీఎం రేవంత్రెడ్డి శనివారం ‘ఎక్స్’ వేదికగా సమాధా నం ఇచ్చారు. 11 నెలల్లో 50 వేలకు పైగా నియామకాలు చేపట్టామని, ఈ విషయంలో ఏ బీజేపీ పాలిత రాష్ట్రం తో పోల్చినా తమదే రికార్డు అని పేర్కొన్నారు. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో గ్యాస్ ధరలు అధికంగా ఉన్నాయని, అదే తెలంగాణలో రూ.500కే సిలిండర్ ఇస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన రెండు రోజుల్లోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం అమలు చేస్తున్నామని, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వైద్యసౌకర్యాన్ని కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఏడాది కాకముందే రుణమా ఫీ కింద రూ.18 వేల కోట్లను జమచేశామని, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు సౌకర్యం కల్పిస్తున్నామని తెలిపారు.