రామగుండం : ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేద అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా సహాయనిధులను అందజేస్తూ వారికి కొండంత అండగా నిలుస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. కార్పొరేషన్ పరిధిలోని 20వ డివిజన్‌కు చెందిన దండుగుల హరిప్రియ అనే చిన్నారి కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతుంది.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చందర్ సీఎంఆర్ఎఫ్ ద్వారా చిన్నారి వైద్యచికిత్స నిమిత్తం అయ్యే రూ. 2. 50 లక్షల ఎల్వోసీ ని చిన్నారి తండ్రి శ్రీనివాస్ కు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని నిరుపేద అనారోగ్య బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా కోట్లాది రూపాయలను మంజూరు చేయుంచినట్లు తెలిపారు.
నిరుపేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే సంకల్పంతో సీఎం సహాయ నిధి ద్వారా ఆర్థిక భరోసాను కల్పిస్తున్నామన్నారు. పేదలు సీఎంఆర్ఎఫ్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కన్నూరి సతీశ్ కుమార్, కల్వచర్ల కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.