తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఓ లేఖను పంపారు.
తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున గవర్నర్ తమిళిసైకి బర్త్ డే విషెస్ చెబుతున్నట్లు ఆ లేఖలో సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆమెకు ఆ భగవంతుడి ఆశీస్సులుండాలని ఆకాంక్షించారు. తమిళిసై మరిన్ని రోజులు ప్రజలకు సేవచేసేలా ఆమెకు శక్తిని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.