Haritha Haram | హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తల్లి ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు.. భూమి తల్లికి పచ్చని రంగేసినట్టు.. ఇప్పుడు ఎక్కడ చూసినా పచ్చని చెట్లతో తెలంగాణ ప్రాంతం అలరారుతున్నది. దశాబ్దాలపాటు నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతం.. నేడు పచ్చని పంటలతో, మైదాన ప్రాంతం నిండుగా దట్టమైన చెట్లతో మూడమూచ్చటగా ఉన్నది. ఎనిమిదేండ్లలో నాటిన 273.33 కోట్ల మొక్కలతో పురి విప్పిన నెమలి వలే తెలంగాణ పచ్చని చెట్లతో నాట్య మాడుతున్నది.
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ కూడా మొక్కలు లేని మైదాన ప్రాంతం కనిపించడం లేదు. అంతలా తెలంగాణ హరితమయం అయిందంటే అతిశయోక్తి కాదు. ఇదంతా ఒకటి రెండేండ్లలో సాధ్య పడలేదు. అంత సులభంగా విజయం దక్కలేదు. ఉమ్మడి పాలనలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చుకొనేందుకు సీఎం కేసీఆర్ అనేక పథకాలకు అంకురార్పణ చేశారు. భవిష్యత్ తరాలకు ఆస్తులు పంచడం కన్నా.. స్వచ్ఛమైన గాలి, నివాస యోగ్యమైన పచ్చని ప్రకృతి పరిసరాలను అందించాలనే సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పం నుంచి పుట్టినదే తెలంగాణకు హరితహారం పథకం.
సీఎం సక్సెస్‌కు పచ్చని చెట్లే సాక్ష్యం
తాను నమ్మిన ప్రకృతి పునరుజ్జీవనాన్ని తెలంగాణ సమాజంలోని ప్రతి ఒక్కరి మదికి ఎకేలా చేయటంలో సీఎం కేసీఆర్ సక్సెస్ అయ్యారు. ఆయన కృషి, పట్టుదల ఫలితాలే దశాబ్ది తెలంగాణలో మన కండ్ల్ల ముందు కనిపిస్తున్న సతతం హరితం.. తెలంగాణం. ఎమిదేండ్లలో నాటిన 273.33 కోట్ల మొక్కలు చెట్లుగా మారి ఆక్సిజన్‌తోపాటు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. హరిత తెలంగాణ సాధనలో ప్రభుత్వ సంకల్పం, ప్రజల భాగస్వామ్యమే పచ్చని విజయానికి సాక్షిగా నిలిచింది. ఇందుకు ప్రభుత్వం రూ.10,822 కోట్లు ఖర్చుచేసింది. రాష్ట్రం నిత్యం పచ్చగా ఉండాలంటే హరితహారం నిరంతర ప్రక్రియలా కొనసాగాలి. అందులో భాగంగానే 9వ విడత హరితహారం కార్యక్రమం సోమవారం మొదలు కానున్నది.
Khammamharitha Haram Planta
అటవీ పునరుద్ధరణ ద్వారా అటవీశాఖ సాధించిన విజయాలు
పట్టణ ప్రాంత అటవీ ఉద్యానవనాలు, హరిత వనాలు
హరితహారానికి దకిన అవార్డులు, గుర్తింపు
తుమ్మలూరులో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి సబిత
తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్కులో సోమవారం జరిగే హరితోత్సవం కార్యక్రమ ఏర్పాట్లను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పరిశీలించారు. ఆమె వెంట ఎంపీ రంజిత్‌రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సీఎం కార్యదర్శి భూపాల్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ ప్రియాంక వర్గీస్, పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్, సీపీ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.
పుడమిపై కేసీఆర్ ఆకుపచ్చని సంతకం
ఏదైనా ప్రభుత్వ కార్యక్రమంగా నడిచేకన్నా, ప్రజా ఉద్యమంగా సాగినప్పుడే విజయవంతమవుతుంది. తెలంగాణ సాధన ఉద్యమాన్ని నడిపిన కేసీఆర్‌కు ఇది బాగా తెలుసు. అందుకని హరితహారం కార్యక్రమంలో ప్రజలను పెద్ద ఎత్తున భాగస్వాములను చేశారు.
ప్రకృతి పరవశించేలా మొకలు నాటాలి
తెలంగాణకు హరితహారం తొమ్మిదో విడత కార్యక్రమాన్ని రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పారులో సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మొక్కను నాటి ప్రారంభించనున్నారు. హరితోత్సవంలో ప్రతి ఒకరూ పాల్గొని విజయవంతం చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ప్రకృతి పరవశించేలా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో పెద్దఎత్తున మొకలు నాటాలని కోరారు. రాష్ట్రంలో పచ్చదనం పెంపునకు అటవీశాఖ ఆధ్వర్యంలో చేసిన కృషి, ఫలితాల గురించి ప్రజలకు వివరించాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో నిర్వహించే‘హరితోత్సవం’లో అడవుల పరిరక్షణకు విశేష కృషి చేసిన అటవీ అధికారులు, సిబ్బందిని సన్మానించి, అవార్డులు అందజేయనున్నట్టు చెప్పారు.
Pp