CM KCR | కత్తిపోట్లకు గురైన మెదక్ పార్లమెంట్ సభ్యుడు, దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సోమవారం రాత్రి పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై తీశారు. ఆందోళన చెందవద్దని ప్రభుత్వం, పార్టీ అండగా ఉంటుందని సీఎం పేరొన్నారు. ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఎప్పటికప్పుడు ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించాలని అక్కడే ఉన్న వైద్య ఆరోగ్య, ఆర్ధిక శాఖ మంత్రి హరీష్ రావును సీఎం ఆదేశించారు.
కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం సంఘటన దురదృష్టకరమని కేసీఆర్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన పై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకుంటామని సీఎం పేరొన్నారు. ఎన్నికల సభలను ముగించుకుని హెలికాఫ్టర్ లో సోమవారం సాయంత్రం బేగం పేట ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న ముఖ్యమంత్రి హుటాహుటిన యశోద హాస్పిటల్ కు వెళ్లాలని భావించారు. అయితే ప్రభాకర్ రెడ్డికి ఆపరేషన్ జరుగుతున్నదని ఇంకా రెండు, మూడు గంటలు సమయం పడుతుందని సమాచారం అందడంతో ముఖ్యమంత్రి 8 గంటల ప్రాంతంలో హాస్పిటల్ కు చేరుకుని ప్రభాకర్ రెడ్డి ని పరామర్శించారు. హాస్పిటల్ కు భారీ సంఖ్యలో తరలి వచ్చిన నాయకులు , కార్యకర్తలకు కూడా ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట మంత్రులు తన్నీరు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎంపీ పోతుగంటి రాములు, ఎమ్మెల్సీ మధుసూదనా చారి తదితరులు ఉన్నారు .
కాగా, దాడిలో తీవ్ర గాయాలపాలైన ప్రభాకర్‌రెడ్డికి.. వైద్యులు దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ నిర్వహించారు. చిన్న ప్రేగుకు నాలుగో చోట్ల గాయాలయ్యాయని వైద్యులు చెప్పారు. పది సెంటీమీటర్ల మేర చిన్నపేగును తొలగించినట్లు పేర్కొన్నారు. గ్రీన్ ఛానెల్‌తో హైదరాబాద్‌కు తరలించకపోతే మరింత ఇబ్బంది అయ్యేదన్నారు. రక్తం అంతా కడుపులో పేరుకుపోయిందని తెలిపారు. లోపల రక్తం పేరుకుపోవడం, ప్రేగుకు నాలుగుచోట్ల గాయాలు కావడంతో సర్జరీ ఆలస్యం అయ్యిందని చెప్పారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స కొనసాగిస్తున్నట్లు వివరించారు.
మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పరామర్శించారు. యశోదా ఆసుపత్రికి వెళ్లిన సీఎం కేసీఆర్.. ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిపై తీశారు. అలాగే, వైద్యులను అడిగి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. pic.twitter.com/0RpquuL4AJ
— Namasthe Telangana (@ntdailyonline) October 30, 2023