హైదరాబాద్ : రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సమీకృత కలెక్టరేట్‌కు ప్రారంభోత్సవం చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో సిద్ధిపేట పోలీస్ కమిషనర్ ఎన్ శ్వేత ఆధ్వర్యంలో పోలీసులు ములుగు మండలం వంటిమామిడి నుంచి బెజ్జంకి మండలం దేవక్కపల్లి వరకు రాజీవ్ రహదారిని పర్యవేక్షించారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. రాజీవ్ రహదారిపై మొత్తం 395 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.