CM KCR | పటాన్చెరు : రాష్ట్రంలో పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల కార్మికుల సంపాదన పెరిగింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కార్మికులు డబుల్ డ్యూటీలు చేసుకుని, పది రూపాయాలు మిగిలించుకుంటున్నారని కేసీఆర్ తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, మహిపాల్ రెడ్డికి మద్దతుగా ప్రసంగించారు.
పారిశ్రామిక కార్మికులకు మనవి చేస్తున్న. కాంగ్రెస్ రాజ్యం ఎట్ల ఉండే.. మన రాజ్యం ఎట్ల ఉంది. ఆనాడు కరెంట్ లేదు, మంచి నీళ్లు, సాగునీళ్లు లేవు. రాష్ట్రమంతా కూడా పెద్ద బాధ, రైతుల ఆత్మహత్యలు, చేనేతల ఆకలిచావులు, బతుకపోయి వలసపోయిన బిడ్డలు. మహబూబ్‌నగర్, నారాయణ్‌ఖేడ్ ప్రాంతాలకు చెందిన ప్రజలు.. ఎండాకాలం వస్తే హైదరాబాద్ బతుకుపోవుడు ఇదంతా మీరు చూశారు అని కేసీఆర్ తెలిపారు.
పటాన్చెరు పారిశ్రామికవాడలో కాంగ్రెస్ రాజ్యంలో ఎన్నడూ కూడా కరెంట్ సక్కగా రాకపోవు. నాకు చాలా మంది కార్మికులు చెప్పారు. 24 గంటల కరెంట్ వల్ల రెండు షిఫ్టుల్లో పని చేసుకుంటున్నాం అని చెప్పారు. పది రూపాయాలు మిగిలించుకొని మా ఇండ్లకు పంపుతున్నామని చెబుతున్నారు. నాణ్యమైన 24 గంటల కరెంట్ రావడం వల్ల ఆ యజమానులు ఉత్పత్తి పెంచుతున్నరు. వాళ్లు లాభపడుతున్నరు. డబుల్ డ్యూటీలు చేసుకుని కార్మికులు సంపాయించుకుంటున్నారు. ఇది ఇంకా పెరుగుతది. ఎవరు ఆపిన ఆగదు. పాశమైలారంలో కూడా కామన్ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టి అక్కడ కూడా కాలుష్యాన్ని తగ్గిస్తున్నాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.
మీరు హైదరాబాద్‌లో అంతర్భాగం అయ్యారు కాబట్టి మీ గురించి నిరంతరం ప్రభుత్వంలో ఆలోచనలు జరుగుతూనే ఉంటాయి. కాలుష్య రహిత పరిశ్రమలకు నిలయంగా చేసుకుని ఈ పటాన్చెరును బాగా అభివృద్ధి చేసుకుందాం. ఇంతకు ముందు ఇక్కడ ఓట్ల సంఖ్య 2 లక్షలు ఉండే. ఇవాళ 4 లక్షలకు పోయింది. వీళ్లంతా దేశం మొత్తం నుంచి వచ్చారు. గతంలో నేను వచ్చినప్పుడు ఆర్డీవో ఆఫీసు, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు, ఒక ఐటీఐ కాలేజీ కావాలని కోరారు. తెల్లారే జీవో ఇచ్చాం. ఆఫీసులన్నీ వచ్చేశాయి. బీఆర్ఎస్ పార్టీ ఢిల్లీకి గులాం కాదు. ఢిల్లీలో మాకు ఎవడూ బాస్ ఉండడు. తెలంగాణ ప్రజలే మాకు బాసులు. మమ్మల్ని ఎవరూ నిర్దేశిస్తారు..? మాకు ఆదేశం ఎవరు ఇస్తారు..? మీరే ప్రజలు ఇస్తరు. నేను ఆరో జు వచ్చాను. మీరు కోరారు. తెల్లారే మంత్రి హరీశ్‌రావు జీరో జారీ చేసి పంపించారు. ఈ రకంగా అన్ని పనులు కూడా ఉంటాయని కేసీఆర్ పేర్కొన్నారు.