CM KCR | ఉత్తమ్‌కుమార్ రెడ్డి రైతుబంధు వేస్ట్ అంటున్నాడని.. పీసీసీ అధ్యక్షుడు 24 గంటల కరెంటు ఇచ్చి వేస్ట్ చేస్తున్నాడని సీఎం కేసీఆర్ అన్నారు. పాలేరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్.. రైతుబంధు ఉండాలా వద్దా..? 24 గంటల కరెంటు కావాలా వద్దా? అంటూ ప్రజలను కేసీఆర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా జనం రైతుబంధు ఉండాలి.. 24 గంటల కరెంటు కావాలంటూ నినదించారు.. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘రాష్ట్రంలో పార్టీల వైఖరులను చూడాలి. ఏం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ నేతలు. మాజీ పీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఉవాచ. రైతుబంధు దుమారటన. రైతుబంధు వేస్ట్ అట. విలువైన ప్రజల పన్నులు కేసీఆర్ చెడగొడుతున్నడట. రైతుబంధు దుబారనా? రైతుబంధు ఉండాలా?’ అంటూ సీఎం కేసీఆర్ ప్రజలను ప్రశ్నించారు. రైతుబంధు ఉండాలి అంటూ జనం నినదించారు.
‘ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు 24 గంటల కరెంటు ఇచ్చి కేసీఆర్ వేస్ట్ చేస్తున్నడు.. మూడు గంటలు సరిపోతుందా? ఎన్ని గంటల కరెంటు కావాలి?’ అంటూ సీఎం కేసీఆర్ ప్రజలను ప్రశ్నించారు. ఈ సందర్భంగా సభకు హాజరైన అశేష జనవాణి మాకు 24 గంటలు కావాలి’ అంటూ నినదించారు. ‘నేను ఎక్కడ అడిగినా తెలంగాణ నలుమూలలో ఇదేవిధంగా ప్రజలు చెబుతున్నారు. కానీ, కాంగ్రెస్ నేతల వైఖరి రైతుబంధు వేస్ట్.. ఇవ్వద్దు కానీ మనం పంచుకొని తినాలి. 24 గంటల కరెంటివ్వద్దు.. మనం హైదరాబాద్‌లో ఏసీలో ఉండాలి.. ఇదీ వారి నీతి. పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే ఏం జరుగుతుంది ? రైతుబంధుకు రాంరాం.. దళితబంధుకు జై భీమ్. కరెంటు కాటకలుస్తది.. కైలాసం వైకుంఠపాళి ఆటలో పెద్ద పాము మింగినట్లయితది. మళ్లీ మొదటికి పరిస్థితి వస్తుంది. ఏ గతి కావాలో ప్రజలు నిర్ణయం చేయాలి’ అని పిలుపునిచ్చారు.