CM KCR | రాష్ట్ర మలి దశ ఉద్యమ సమయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరును గుర్తు చేస్తూ ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు. హుజూర్నగర్ ప్రజా ఆశీర్వాద సభలో కాంగ్రెస్ వ్యవహారశైలిపై విమర్శలు గుప్పించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘1956లో చిన్న పొరపాటు తెలంగాణ కాంగ్రెస్ చేసినందుకు 56 సంవత్సరాలు తెలంగాణ ఏడ్చింది. కరెంటు లేదు. మంచినీళ్లు లేవు. అయితయనుకున్న ప్రాజెక్టులు కాలే.. గొడగొడ ఏడ్చినం. ఉద్యోగాలు పోయినయ్.. నిధులు పోయినయ్. కండ్లు అప్పగించి చూసినం. మళ్లీ 2001లో మళ్లీ మొదలు పెట్టి కొట్లాడితే.. ఇదే కాంగ్రెస్ మనల్ని మోసం చేసింది’ అన్నారు.
‘తెలంగాణ ఇస్తమని నమ్మబలికి 2004లో పొత్తు పెట్టుకొని గడ్డకు ఎక్కారు. మనిషికిన్ని మంత్రి పదవులు పంచుకుని గడ్డకెక్కారు. ‘తీర్థం పోదాం తిమ్మక్కంటే.. నువ్వు గుళ్లె నేను చలిలే’ అన్నట్లుగా అయిపోయింది. తీర్థం అయిపోయింది అధికారం వచ్చింది.. మంత్రి పదువులు వచ్చినయ్. తెలంగాణను వదిలిపెట్టారు. మనం వదల్లేదు.. కొట్టాడుకుంటూ కొట్లాడుకుంటూ పోయాం.. 14 ఏళ్లు గడిచిన తర్వాత తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడే ఏదో ఒకటి తేలాలని ఆమరణ దీక్షకు పూనుకుంటే అప్పుడు తెలంగాణ కోసం దిగివచ్చారు. ఆ సమయంలో వీరంతా తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా చేసిండా.. రాజీనామాలు చేయమంటే లాగులు తడిసిపోయినయ్. గజగజ వణుక్కుంటూ పోయారు.. కిందనో మీదనో మనం తెచ్చాం. తెచ్చిన తర్వాత ప్రజలకు చెప్పాను.. న్యాయం చెప్పండి ఎవరైతే తెలంగాణకు ఇంత వెలుగుపెడతరో.. ఎవరు తండ్లాండుతరో వాళ్లను గెలిపివ్వమని చెప్పాను. టీఆర్ఎస్ను గెలిపించారు. పని చేసుకుంటూ పోతున్నాం’ అన్నారు.