CM KCR | మతపిచ్చిలేపే బీజేపీని చెత్తకుప్పపై పారేయాలని సీఎం కేసీఆర్ అన్నారు. బీజేపీకి ఓటువేస్తే ఓటేస్తే మోరీలపారేసినట్లేనని.. కాంగ్రెస్‌కు వేయడం కూడా ఇంకా వేస్టేనన్నారు. ఆదిలాబాద్‌లో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. జోగు రామన్నను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ లోయర్ పెన్‌గంగా అని ఊరించారు. ప్రతి ఎలక్షన్లో ప్రామిస్ చేసుడే. ఒకే ఒక్కడు జోగురామన్న తన మాట నెలబెట్టుకొని చనకా కొరటా బ్యారేజీని పూర్తి చేయించాడు. ఆదిలాబాద్ చరిత్రలో ఎవరూ చేయలేదు. జోగు రామన్న ఒక్కడే నా వెంబడి పడి.. నన్ను కూడా పెన్‌గంగ కాడికి తీసుకువచ్చి చనకా కొరటా చేయిస్తున్నడు. దాదాపు పంపుహౌస్‌లు, కాలువలు పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ కాలువలు తవ్వుకుంటున్నాం. మంచిగా 50-51వేల ఎకరాలకు నీళ్లు వస్తయ్. చనకా కొరటా కాలువ నుంచే పిప్పల్‌కోట్ రిజర్వాయర్‌కు లింక్ ఇచ్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది’ అన్నారు.
‘కాంగ్రెస్ జమానలో 8వేల ఎకరాలు పారలే. జోగు రామన్న వచ్చి కాలువలను రిపేర్ చేయిస్తే చివరిదాకా నీళ్లు అందుతున్నయ్. కాంగ్రెస్ పట్టించుకోని వాటిన్నంటిని బీఆర్ఎస్ చక్కదిద్దింది. చెడగొట్టినవన్నీ మంచిగ చేస్తున్నది. కాంగ్రెస్ జమానలో కరెంటు లేదు. తెల్లందాక కొద్దిగా.. పొద్దందాక కొద్దిగా.. లోవోల్టేజీ.. మోటలు కాలడం అనేక బాధలు ఉండేది. జోగు రామన్న ఉత్తమమైన వ్యక్తి. సామాన్యమైన వ్యక్తి. ఎమ్మెల్యే అంటే పకర్ లేదు. పొద్దంతా ఆయన ఇంటినిండా జనం జాతరలే ఉంటది. అద్భుతంగా ప్రజల్లో కలిసుండే వ్యక్తి. జోగురామన్నను మెజారిటీతో గెలిపించాలి. ఆయన ఆదిలాబాద్‌కు చాలా తీసుకువచ్చాడు. సార్ మా జిల్లాలో ఇంజినీరింగ్ కాలేదని నాతో కొట్లాడి ఇంజినీరింగ్ కాలేజీ తెచ్చాడు. అగ్రికల్ కాలేజీ, పాలిటెక్నికల్ కాలేజీ తెచ్చిండు. ఆదిలాబాద్ అభివృద్ధి కావాలంటే జోగు రామన్నతో అయితది ఇంకెవడితో కాదు’ అన్నారు.
‘బీజేపీ భారతదేశంలో 150 మెడికల్ కాలేజీలు పెడితే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. నవోదయ విద్యాలయాలు జిల్లాకోటి ఇవ్వాలని చట్టం ఉన్నా ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటుకూడా బీజేపీకి ఎందుకు వేయాలి? ఇవాళ బీజేపీకి ఓటువేస్తే మోరీలపరేసినట్లే అవుతుంది. వేస్ట్ తప్పా మనకు పనికివచ్చే గవర్నమెంట్ కాదు. ఈ రోజు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నదమ్ముళ్ల కలిసి ప్రేమతో ముందుకెళ్లే రాష్ట్రం ఇది. సదర్మాట్ను నిజాం రాజు కట్టాడు. ఎన్నో చెరువులు కట్టించారు. అందరం ఆనాటి నుంచి ఈనాటి దాకా కలిసున్నాం. ఇప్పుడు కలిసే ఉండాలి. మతపిచ్చిలేపే బీజేపీని చెత్తకుప్ప మీద పారేయాలి. బీజేపీకి ఒక్కవోటు వేసిన వేస్టే. కాంగ్రెస్‌కు వస్తే ఇంకా వేస్టే. రాబోయే రోజు ప్రాంతీయ పార్టీలదే. గ్యారంటీగా రాసిపెట్టుకోండి. వచ్చేతాప మోదీకి మెజారిటీ రాదు. సంకీర్ణ ప్రభుత్వమే వస్తది. అసెంబ్లీలోనే కాదు.. పార్లమెంట్ సీటు కూడా ప్రతీ ఒక్కటీ గెలవాలి. అప్పుడు మన తడాఖా ఢిల్లీలో చూపించే అవకాశం వస్తది. మన హక్కులన్నీ పరిరక్షించబడుతయ్. ఇవన్నీ గమనంలో పెట్టుకొని మంచి మనసుతో పెద్ద మెజారిటీ ఇచ్చి జోగురామన్నను గెలిపించాలని కోరుతున్న’ అన్నారు.