CM KCR | హైదరాబాద్ : జీవితంలో ఒక్కటే ఒక్కసారి ఓడిపోయాను.. వాస్తవానికి గెలిచి ఓడిపోయాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తూఫ్రాన్ పరిధిలోని తూంకుంటలోని కన్వెన్షన్ హాల్లో గజ్వేల్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. మీ అందరి పుణ్యంతో గజ్వేల్ ఎమ్మెల్యే అయ్యాను. జీవితంలో ఒకటే సారి ఓడిపోయాను. వాస్తవంగా గెలిచి ఓడిపోయాను అది. గెలిచిన కానీ వయసు తక్కువ లొల్లి ఎక్కువ పెడుతుంటి. కానీ ఆలోచన లేకుండే. అప్పుడు నా వయసు 25 ఏండ్లు. అప్పుడు బ్యాలెట్ సిస్టం ఉంటుండే. ఎలక్ట్రానిక్ మేషిన్లు లేకుండే. ఓ ఐదారు వేల ఓట్లు నాకు వచ్చినవి దాంట్ల కలిపేసిండ్రు. కలిపేసి 700 ఓట్లతోని ఓడిపోయినట్లు డిక్లేర్ చేసిండ్రు. రీ కౌంటింగ్‌కు అవకాశం ఇవ్వలేదు. హైకోర్టులో కేసు వేసినం అదంతా జరిగింది. ఆ ఒక్కసారి ఓడించబడ్డ.. ఓడిపోలేదు నేను. ఆ తర్వాత నేను వెనక్కి మళ్లీ చూడలేదు.. గెలిచినాను. ఈ తెలంగాణ గడ్డ ఎంత గొప్పది అంటే.. కేసీఆర్ తెలంగాణ వస్తది.. నీ మొండి తనమే తెస్తది అని జయశంకర్ చెప్పారు. అనేక బాధలు పడ్డ పాలమూరు జిల్లాను మీ కండ్లతోటి చూడాలి. మీరు మహబూబ్‌నగర్ ఎంపీగా నిలబడాలని చెప్పారు. కరీనంగర్‌లో భారీ మెజార్టీతో గెలిపించారు. మహబూబ్‌నగరలో కూడా గెలిపించారు. మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. చరిత్రలో పాలమూరుకు కీర్తి ఉంటది. మళ్లీ ఎన్నికలు వచ్చాయి. గజ్వేల్‌లో నామినేషన్ వేశాను. అందరూ కలిసి గెలిపించారని తెలంగాణ గడ్డ గొప్పతనాన్ని కేసీఆర్ తెలియజేశారు.