CM KCR | తెలంగాణ ఆవిర్భావ దిశాబ్ది వేడుకల నిర్వహణపై సచివాలయంలో సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష చేపట్టారు. వేడుకలను ఎన్ని రోజుల పాటు నిర్వహించాలి ? ఎప్పటి నుంచి నిర్వహించాలి ? విషయమై నిర్ణయించనున్నారు. ఉత్సవాలు, బహిరంగసభ తదితర అంశాలపై అధికారులతో సీఎం చర్చిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లవుతున్న సందర్భంగా నెల రోజుల పాటు వేడుకలను నిర్వహించాలని, హైదరాబాద్ నగరంలో వారం రోజుల పాటు వైభవంగా ఉత్సవాలు నిర్వహించాలని భావిస్తున్నారు. అమరుల త్యాగాలు స్మరించుకోవడం సహా తెలంగాణ ప్రగతి ప్రస్థానాన్ని కళ్లకు కట్టేలా కార్యక్రమాలు జరుపాలని చూస్తున్నారు. ఈ మేరకు సంబంధిత శాఖ అధికారులతో సీఎం చర్చిస్తున్నారు.