హైదరాబాద్ : ఈడీ దాడులకు భయపడే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. తెలంగాణలో భవన్లో టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ముగిసిన అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఇన్‌కం ట్యాక్స్, ఈడీ దాడులు చేస్తారని గత రెండు, మూడు రోజుల నుంచి యూట్యూబ్‌లో ప్రచారం చేస్తున్నారు. ఈడీ కాకపోతో బోడీ దాడులు చేయమను.. ఎవరు వద్దంటున్నారు. ఎవడు భయపడుతారు.
కేసీఆర్ ఈ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు భయపడుతాడా? ఈడీలకు, బోడీలకు, ఇన్‌కం ట్యాక్స్‌లకు భయపడితే 15 ఏండ్లు తెలంగాణ ఉద్యమం చేద్దుమా? మేమా భయపడేది. ఈడీ దాడులని, సీబీఐ దాడులని బెదిరిస్తే కేసీఆర్ భయపడుతాడా? ఇలాంటి పనులు అన్ని చోట్ల వర్కవుట్ కావు. భయంకరంగా స్కామ్‌లు చేసేవాళ్లు భయపడుతారు. మేం భయపడే ప్రసక్తే లేదు. పిట్ట బెదిరింపులకు, ఈడీ, బోడీ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. చినజీయర్ స్వామితో తనకు ఎలాంటి విభేదాలు లేవని మీడియా అడిగిన ప్రశ్నకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు.