CM KCR | హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ నుంచి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మరికాసేపట్లో మహారాష్ట్రకు చెందిన చంద్రపూర్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. వారందరికీ సీఎం కేసీఆర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ పార్టీ మూడు బహిరంగ సభలను విజయవంతంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. నాందేడ్, కంధార్ లోహా, ఔరంగాబాద్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ సభలు విజయవంతం అయ్యాయి.