మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 20:05:48

సాహితీవేత్త రామా చంద్రమౌళికి కాళోజీ సాహిత్య అవార్డు

సాహితీవేత్త రామా చంద్రమౌళికి కాళోజీ సాహిత్య అవార్డు

హైదరాబాద్‌:  ప్రముఖ కవి, కథ, నవలా రచయిత, సాహితీవేత్త  రామా చంద్రమౌళికి ముఖ్యమంత్రి  కె.చంద్రశేఖర్ రావు బుధవారం ప్రగతి భవన్‌లో  కాళోజీ సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. కాళోజి పురస్కారానికి  రామా చంద్రమౌళి సంపూర్ణ అర్హుడని  సీఎం అన్నారు.   కాళోజీ సాహిత్య పురస్కారం కింద 1,01,116 నగదు, జ్ఞాపిక అందించి, శాలువా కప్పి సన్మానించారు.

ఈ కార్యక్రమంలో సాంస్కృతిక శాఖ మంత్రి  వి. శ్రీనివాస గౌడ్, ప్రభుత్వ సలహాదారు  కెవి రమణాచారి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి   సోమేశ్ కుమార్, సాంస్కృతిక శాఖ కార్యదర్శి  శ్రీనివాస రాజు, డైరెక్టర్  మామిడి హరికృష్ణ, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు  పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాళోజీ జయంతి (సెప్టెంబరు 9)ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం  ప్రతిఏడాది   ఆయన పేరు మీద అవార్డు ఇస్తున్నది. logo