హైదరాబాద్: ప్రముఖ చిత్రకారుడు గోపి మరణం పట్ల ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. నాలుగు దశాబ్దాల పాటు ఇల్లస్ట్రేటర్‌గా, కార్టూనిస్ట్‌గా తన కుంచెతో అద్భుత ప్రతిభను కనబరిచారని కొనియాడారు. పాలమూరుకు చెందిన గోపి మరణంతో తెలంగాణ ఒక గొప్ప చిత్రకారుడిని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోపి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రముఖ చిత్రకారుడు గోపి (లూసగాని గోపాల్ గౌడ్) కరోనాతో చికిత్స పొందుతూ శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ దవాఖానలో మరణించిన విషయం తెలిసిందే. బంజారాహిల్స్‌లోని మహాప్రస్థానంలో సాయంత్రం ఆయనకు కొవిడ్ నిబంధనలకు అనుసరించి దహన సంస్కారాలు నిర్వహించారు. 1970, 80 దశకంలో ఆయన మంచి కళాకారుడిగా గుర్తింపు పొందారు.
నాలుగు దశాబ్దాల పాటు ఇల్లస్ట్రేటర్ గా కార్టూనిస్ట్ గా తన కుంచెతో అద్భుత ప్రతిభను కనబరిచిన పాలమూరుకు చెందిన గోపి మరణంతో, తెలంగాణ ఒక గొప్ప చిత్రకారున్ని కోల్పోయిందని విచారం వ్యక్తం చేశారు. దివంగత గోపి కుటుంబ సభ్యులకు సీఎం తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
— Telangana CMO (@TelanganaCMO) May 22, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి