స్వతంత్ర పాలస్తీనా ఒక్కటే పరిష్కారం: బైడెన్

వాషింగ్టన్: యుద్ధంలో దెబ్బతిన్న గాజా పునర్నిర్మాణ కృషికి సాయం అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. శుక్రవారం పశ్చిమాసియా ఘర్షణలపై మాట్లాడుతూ,
పాలస్తీనా సమస్యకు రెండు రాజ్యాల పరిష్కారమే ఉత్తమమని చెప్పారు. ఇజ్రాయెల్ సరసన స్వతంత్ర పాలస్తీనా రాజ్యం ఏర్పాటు చేయడమే ఆ ప్రాంతంలోని ఘర్షణలకు ఏకైక పరిష్కారమని స్పష్టం చేశారు. అలాగే జెరూసలేంలో మతకలహాలను ఆపాలని ఇజ్రాయెల్‌కు చెప్పినట్టు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అన్నారు. అయితే ఇజ్రాయెల్ భద్రత పట్ల తన నిబద్ధత విషయంలో ఎలాంటి మార్పు లేదని తెలిపారు. ఇజ్రాయెల్ అస్తిత్వాన్ని ప్రాంతీయ దేశాలు నిర్ద్వంద్వంగా గుర్తిస్తే తప్ప శాంతి నెలకొనదని బైడెన్ అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్ తో పాటుగా సార్వభౌమాధికారాలు గల పాలస్తీనా ఏర్పాటు అనే రెండు దేశాల పరిష్కారం దశాబ్దాలుగా అంతర్జాతీయ దౌత్య పరిష్కారంగా ఉన్నదని గుర్తు చేశారు. డోనాల్డ్ ట్రంప్ హయాంలో అమెరికా విధానం పూర్తి ఏకపక్షంగా ఇజ్రాయెల్ వైపు మొగ్గిందని విమర్శలు వచ్చాయి. కాగా ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బైడెన్ సమతూక విధానం ప్రకటించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఏసీబీ ఉచ్చులో ఎస్సై’.. సంచలనం సృష్టించిన ‘నమస్తే తెలంగాణ’ కథనం.. రంగంలోకి నిఘా వర్గాలు!
Upasana | మహిళల విజయంపై ఉపాసన కీలక సందేశం..ఇతర మహిళలను తొక్కేసి విజయం సాధించొద్దు..!
Virosh | విజయ్ దేవరకొండ – రష్మిక విడాకులు తీసుకుంటున్నారా.. సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్..!
Hyderabad | హైదరాబాద్ పవర్ గ్రిడ్ కార్యాలయంలో షాక్.. మహిళల వాష్‌రూమ్‌లో సీక్రెట్ ఫోన్!
T Square | టీ స్క్వేర్ పనులకు మోక్షమెప్పుడో? ఏడాది పూర్తి కావొస్తున్నా.. పట్టాలెక్కని ప్రాజెక్టు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

