హైదరాబాద్ : నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నాయకులతో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ప్రగతి భవన్లో జరుగుతున్న ఈ సమావేశానికి మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరయ్యారు. మునుగోడు ఉప ఎన్నికపై సీఎం చర్చిస్తున్నారు.
నిన్న రాత్రి మునుగోడు నియోజకవర్గానికి చెందిన టీఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో మంత్రి జగదీశ్ రెడ్డి సమావేశమైన విషయం విదితమే. ఆ సమావేశం ముగిసిన అనంతరం జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మునుగోడు టీఆర్ఎస్లో అసంతృప్తులు లేవు అని స్పష్టం చేశారు. మునుగోడులో టీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమని చెప్పారు. టీఆర్ఎస్ అభ్యర్థి 50 వేల మెజార్టీతో గెలవబోతున్నానడని మంత్రి పేర్కొన్నారు.