అన్ని వర్గాల ఆపద్బాంధవుడు కేసీఆర్: ఎమ్మెల్యే నోముల భగత్
సీఎం కేసీఆర్ అన్ని వర్గాలకు ఆపద్బాంధవుడిగా నిలిచారని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. అమిత్‌షా ప్రసంగంలో పసలేదని, ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ ఉత్తవేనని ఆయన తేల్చిచెప్పారు. రాష్ట్రంలో అన్ని వర్గాలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నాయన్నారు. మునుగోడులోనే కాదు.. రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా గెలుపు టీఆర్ఎస్దేనని స్పష్టంచేశారు. రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ ఎన్ని కుమ్మక్కు రాజకీయాలు చేసినా టీఆర్ఎస్ ప్రజాబలం ముందు ఏమీ చేయలేవని చెప్పారు.
దమ్ముంటే మునుగోడులో బీజేపీ మేనిఫెస్టో పెట్టాలి: ఎమ్మెల్యే భాస్కర్ రావు
బీజేపీకి దమ్ముంటే మునుగోడులో మేనిఫెస్టో పెట్టాలని ఎమ్మెల్యే భాస్కర్‌రావు డిమాండ్ చేశారు. అందులో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఉండాలా? వద్దా? వడ్లు కొంటారా ? కొనరా ? వ్యవసాయ మోటార్లకు మీటర్ల విషయం కూడా దమ్ముంటే అందులో స్పష్టం చేయాలని ఆయన సవాల్ చేశారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నందుకు సీఎం కేసీఆర్ మీద అక్కసుతో బీజేపీ ఇలా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. సీఎం కేసీఆర్ సూటిగా అడిగిన ప్రశ్నకు అమిత్‌షా జవాబు చెప్పలేదంటేనే బీజేపీ వ్యవహారం ఏమిటో తేలిపోయిందని ఎద్దేవా చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

