జనగామ : జనగామ జిల్లాలోని యశ్వంత్‌పూర్ వద్ద నూతనంగా నిర్మించిన తెలంగాణ భవన్‌ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరించారు. రెండు ఎకరాల్లో విశాలంగా తెలంగాణ భవన్ కార్యాలయాన్ని నిర్మించారు. ఇకపై ఈ భవన్‌లోనే సభలు, సమావేశాలు, శిక్షణ శిబిరాలు కొనసాగనున్నాయి. తెలంగాణ భవన్లో సమావేశ మందిరం, విశ్రాంతి గదులు, క్యాంటీన్‌ను ఏర్పాటు చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రశాంత్ రెడ్డి, సత్యవతి రాథోడ్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పాల్గొన్నారు.