Yadadri | ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి పర్యటనకు బయల్దేరారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో సీఎం కేసీఆర్ యాదాద్రికి పయనమయ్యారు. యాదాద్రి పర్యటనలో భాగంగా ఆలయ పునర్నిర్మాణ పనులను సీఎం పరిశీలించి, తగు సూచనలు చేయనున్నారు.
మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ దృష్ట్యా పనులను సీఎం పరిశీలించనున్నారు. సుదర్శన యాగం, ఇతర ఏర్పాట్లపై ఆలయ పండితులు, అధికారులతో కేసీఆర్ సమీక్షించి, పలు సూచనలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో యాదాద్రిలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.