CM KCR | అంబేద్కర్ తీసుకువచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం రోజుకింత కాలరాస్తుందని సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్ర అసెంబ్లీలో ఇవాళ విద్యుత్ సంస్కరణలపై లఘు చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బీజేపీ తీసుకువచ్చిన విద్యుత్ సంస్కరణల్లో ఎక్కడా వ్యవసాయానికి ఉచిత కరెంటు ఇవ్వొద్దని చెప్పలేదని పేర్కొన్నారు. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. రఘునందన్‌రావు సభను తప్పదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా కేంద్రం విధానాలను తూర్పారబట్టాను సీఎం కేసీఆర్. ‘ఆధునిక ప్రపంచంలో యావత్ ప్రపంచం కూడా ఆయా దేశాలు, నాగరిక ప్రపంచం ఆవిష్కరించేటటువంటి అభివృద్ధి అనేక కొలమానాల ద్వారా చూస్తారు.
అందులో ప్రధానసూచిన పర్ క్యాపిటా, పవర్ యూటిలైజేషన్. ఏ దేశం, ఏ రాష్ట్రంలో ఎంత పవర్ యూజ్ చేస్తున్నరు? అది చాలా ముఖ్యమైన సూచికల్లో భాగంగా ఆధునిక ప్రపంచ పరిగణిస్తుంది. ఇక్కడ ఇష్యూ ఏంటంటే.. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సమయంలో కరెంటు, దాని సరఫరా, ప్రజల పడ్డ బాధలు, దాన్ని వినియోగించే సమయంలో జరిన మరణాలకు మన అందరం ప్రత్యక్ష సాక్షులం. తెలంగాణ ఏర్పాటుకు ముందు ఆ నాడు అనేక ప్రాంతాల్లో కరెంటు షాక్‌లు కొట్టిచనిపోవడం. బిల్లు కట్టలేదని ఎలక్ట్రిసిటీ విజిలెన్స్ అధికారులు విషం తాగి చనిపోవడం. భిక్షపతి అనే వ్యక్తి జమ్మికుంటలో చనిపోవడం. అక్కడికి మేము అందరం ఉద్యమ సమయంలో వెళ్లాం. వెరసి కష్టాలను ఇప్పుడు తలచుకుంటేనే భయమవుతుంది’ అన్నారు.
‘కష్టపడి అందరం కలిసి పోరాటం చేసినం. తెలంగాణ తెచ్చుకున్నం. తెచ్చుకున్న తర్వాత భయంకరమైన అన్యాయం చేసింది. నేను భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలుపుతున్న. పునర్వీభజన చట్టంలో ఉన్న అనేక అంశాల్లో ఘోరాతి ఘోరంగా మోదీ ప్రభుత్వం అన్యాయం చేసింది. మొదటి కేబినెట్లో కేంద్రం తెలంగాణ గొంతు నులిమేసే విధంగా.. అందులో మరీ ముఖ్యంగా 460 మెగావాట్ల హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్టు సీలేరును ఆంధ్రాకు కేటాయించింది. సోనియా గాంధీ రాష్ట్ర విభజన సమయంలో బిల్లు తుది దశకు వచ్చే సమయంలో తెలంగాణ పవర్ షాటేజ్ ఉంటది. పవర్ యుటిలేజేషన్ ఉంటది. తెలంగాణ మొత్తం భూగర్భ జలాలపైనే ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చింది. సమైక్య రాష్ట్రంలో మాకు వస్తాయన్న ప్రాజెక్టులు రాలేదు కాబట్టి. ప్రజలంతా గతిలేక బోరు వేసుకునే పరిస్థితిలో ఉన్నరు. తెలంగాణలో ఉన్న బోర్లు దేశంలో ఎక్కడా లేవు. కరెంటు కేటాయింపులో అధికంగా కేటాయించాలని కోరితే.. 53శాతం తెలంగాణకు కేటాయించారు. దాన్ని దృష్ట్యా సీలేరు పవర్ ప్రాజెక్టును తెలంగాణకు కేటాయించారు. భవిష్యత్‌లో దీని పరిస్థితి ఇట్లే ఉంటదని అని చెప్పి ఇతరులు పేచీపెట్టినప్పటికీ.. మన్మోహన్ సింగ్ నాయకత్వంలో ఆ రోజు బిల్లులో సింగరేణి కాలరీస్ మొదటి నుంచి తెలంగాణదే.. దానిపై హక్కు తెలంగాణకే అని కేటాయించారు’ అన్నారు.
‘దురదృష్టం ఏంటంటే.. ప్రధానమంత్రి మోదీ మొదటి మీటింగ్‌లో ఆంధ్రాప్రదేశ్ ముఖ్యమంత్రి చేతులో కీలుబొమ్మగా మారిపోయి ఆర్డినెన్స్ తెచ్చారు. వాస్తవానికి ఆర్డినెన్స్ తేవాల్సిన పరిస్థితి కాదు. శాసనసభలు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా రెఫర్ చేయకుండా కర్కషంగా ఏడు మండలాలు, సీలేరు పవర్ ప్రాజెక్టు తెలంగాణ నుంచి వేరు చేశారు. బహుశా నేను అనుకుంటు ఈ దేశంలో ఫస్ట్ పర్సన్ క్రిటిసైజ్ మిస్టర్ నరేంద్ర మోదీ. ఈజ్ ద మోస్ట్ ఫాసిస్ట్ ప్రైమినిస్టర్ ఆఫ్ ద కంట్రీ అని చెప్పా. అప్పుడు తెలంగాణ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చిన. ఆ రోజు నాపై విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డరు.. ప్రమాణస్వీకారం మాత్రం చేయలే.. ఈ దశలో అధికారికంగా ఉండి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తరా? అంటే.. ఇస్తం తప్పదు.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలుపాలని అని చెప్పా.
అప్పుడు తెలంగాణ సమాజం నిరసన తెలిపింది. అనేక పర్యాయాలు చెప్పాం. మండలాల సంగతి వదిలేసినా ప్రాజెక్టునైనా ఇవ్వాలని ప్రధానికి లేఖలు రాశాం. ఆయన పరిగణలోకి తీసుకోలేదు. రఘునందన్‌రావు సత్యదూరమైన విషయాలు చెప్పారు. సభను పక్కదోవ పట్టిస్తున్నరు. వందశాతం తప్పు. అంబేద్కర్ ఉండే ఎంత కొట్లాడునో.. ఇప్పుడు ఆయన లేరు మన దురదృష్టం. ఆయన రాజ్యాంగ స్ఫూర్తిని మోదీ ప్రభుత్వం రోజుకింత కాలరాస్తుంది. అధికారి అనేది బాధ్యత. ఇది రాచరికం కాదు. బాధ్యతలు
అధికారపూర్వకంగా ఉండాలి. రాజ్యాంగంలో కేంద్రం పరిధిలో, రాష్ట్రాల పరిధిలో ఉండాలి.. ఇద్దరు కలిసి సంప్రదించుకొని చేసుకునేందుకు కొన్ని ఉమ్మడి జాబితాలో పెట్టారు. ఈ పవర్ ఉమ్మడి జాబితాలో ఉన్నది. దీనిపై కేంద్రం పెత్తనం లేదు. దురదృష్టవశాత్తు రాష్ట్రాలతో కనీస సంప్రదింపులు చేయకుండా.. అడగకుండా.. మాటమాత్రం చెప్పకుండా వాళ్ల ఇష్టం వచ్చిన పద్ధతిలో.. పార్లమెంట్లో మాట్లాడనీయకుండా మూకదాడులు చేస్తున్నరు.
ప్రతిపక్ష సభ్యుడు లేస్తే వందమంది అధికార పార్టీ సభ్యులు లేచి రకరకాల పేర్లు పెట్టి అరవడం. వారి నోళ్లను మూయించడం.. గందరగోళం సృష్టించి ఆ బిల్లులను పాస్ చేసుకుంటూ ఇలాంటి చట్టాలు చేస్తున్నరు. సమగ్ర పార్లమెంట్లో చర్చిస్తే అనేక పార్టీలు చర్చిస్తయ్. గతంలో బాల్క సుమన్ లోక్‌సభ సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంట్‌ను ఐదురోజులు స్తంభింప చేసినం. అయినా కూడా దానికి జవాబు లేదు. దానిపై చర్చ లేదు. కనీసం ఎదుటివారు చెబితే వినే సంస్కారం లేదు. బూల్డోజ్ చేసి.. మా ఇష్టం అనే పద్ధతిలో ఈ దేశాన్ని నడిపే దుర్మార్గమైన పద్ధతి జరుగుతుంది’ అంటూ మండిపడ్డారు సీఎం కేసీఆర్.