హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీల చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్లు, కార్పొరేషన్ల మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ కోరింది. అధికార పార్టీ ప్రలోభాలకు పాల్పడే అవకాశం ఉన్నందున.. వాటికి అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ రావుల చంద్రశేఖర్రెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధి ఎన్ లలితారెడ్డి ఇతర ప్రతినిధులతో కలిసి శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి వినతిపత్రం అందజేశారు.