చిలగడ దుంపలు: పావుకిలో
పచ్చి బఠాణీలు: అర కప్పు
బియ్యప్పిండి: ఒక టేబుల్ స్పూన్
మైదాపిండి: ఒక టేబుల్ స్పూన్
పచ్చి మిరపకాయలు: రెండు
కొత్తిమీర : ఐదారు రెబ్బలు
బ్రెడ్ ైస్లెస్లు: మూడు
ఉప్పు: తగినంత
నూనె: వేయించడానికి సరిపడా
కుక్కర్ అడుగున నీళ్లు పోసి ఆవిరి మీద చిలగడదుంపల్ని ఉడికించి పెట్టుకోవాలి. బఠానీలను కూడా ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పచ్చి మిరపకాయలు, కొత్తిమీర వేసి గ్రైండ్ చేసుకున్నాక ఉడికించిన బఠాణీలు కూడా వేసి కచ్చాపచ్చాగా రుబ్బుకోవాలి. బ్రెడ్ ైస్లెస్లు కూడా విడిగా మిక్సీ వేసి పొడిగా చేసుకుని పెట్టుకోవాలి. చిలకడదుంపల్ని చెక్కు తీసి ముద్దగా చేసుకున్నాక ముందుగా మిక్సీ పట్టుకున్న బఠాణి మిశ్రమాన్ని అందులో వేసి సరిపడా ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి.
ఈ ముద్దను కట్లెట్ల ఆకృతిలో ఒత్తుకోవాలి. బ్రెడ్ పొడిని ఒక పళ్లెంలో వేసి పెట్టుకోవాలి. గిన్నెలోకి బియ్యప్పిండి, మైదా వేసుకుని నీళ్లు పోసి జారుడుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒత్తి పెట్టుకున్న కట్లెట్లను ఈ పిండిలో ముంచి తీసి, వీటికి బ్రెడ్ పొడిని రెండువైపులా అద్దుకోవాలి. కాసేపు ఆరనిచ్చాక, పొయ్యి మీద బాణలి పెట్టుకొని నూనె పోసుకోవాలి. బాగా కాగాక అందులో కట్లెట్లు వేసి బంగారు రంగులో వచ్చేలా వేయించుకుంటే శివరాత్రి ఉపవాసాన్ని సంప్రదాయబద్ధంగా విరమించేందుకు చిలగడ దుంపల వంటకం సిద్ధమైనట్టే!!