CM KCR | ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ శక్తి 3వ తేదీ వరకే.. 6వ తేదీ నుంచి యధావిధిగా రైతుబంధు : సీఎం కేసీఆర్
CM KCR | ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ శక్తి 3వ తేదీ వరకే.. 6వ తారీఖు నుంచి యధావిధిగా రైతుబంధు మీ ఖాతాల్లో జమ అవుతదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పిచ్చి కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. ఒక రైతుబంధుతోనే ఒక్క విడత రైతుబంధు వేస్తేనే మనకు ఓట్లు వస్తాయని అనుకుంటున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.
CM KCR | చేవెళ్ల : ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ శక్తి 3వ తేదీ వరకే.. 6వ తారీఖు నుంచి యధావిధిగా రైతుబంధు మీ ఖాతాల్లో జమ అవుతదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. పిచ్చి కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. ఒక రైతుబంధుతోనే ఒక్క విడత రైతుబంధు వేస్తేనే మనకు ఓట్లు వస్తాయని అనుకుంటున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు. చేవెళ్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, ఎమ్మెల్యే అభ్యర్థి కాలే యాదయ్యకు మద్దతుగా ప్రసంగించారు.
అప్పటి రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ వస్తే మన భూముల ధరలు పడిపోతాయి. నష్టపోతామని చెప్పారు. మీరే గమనించాలి. ఇవాళ భూముల ధరలు ఏ విధంగా పెరిగాయి. ఏ విధంగా మనం లాభాపడుతున్నాం అనేది ఆలోచించాలి. నిర్ణయం మంచి ఆలోచన చేసి వేయండి ఓటు. అగాథం ఓటు మాత్రం వేఒయద్దు. ఎన్నికలు రాగానే తప్పుడు మాటలు ప్రచారం చేయడం, రకరకాల పిచ్చి ప్రయత్నాలు కూడా చేస్తరు. ఇప్పటికిప్పుడు ఇప్పుడు మీ ముందు మంచి ఉదాహరణ ఉంది. పిచ్చి కాంగ్రెసోళ్లకు పిచ్చి పట్టుకున్నది. ఒక రైతుబంధుతోనే ఒక్క విడత రైతుబంధు వేస్తేనే మనకు ఓట్లు వస్తాయని అనుకుంటున్నారు కాంగ్రెసోళ్లు. ఎన్నిరోజులు అయింది మన రైతుబంధు ఇయ్యబట్టి. ఇది ఆరో సంవత్సరం. క్రమం తప్పకుండా మనం ఇచ్చుకుంటున్నాం. ఇప్పుడు టైం వచ్చింది. యాసంగి పంటలకు రైతులు పొలాలు తడుపుతున్నారు. రైతుబంధు వేయాలి. ఇక దాన్ని ఇయ్యనియొద్దంటే ఇయ్యనియొద్దని కాంగ్రెసోళ్లు రోజు ఎలక్షన్ కమిషన్‌కు దరఖాస్తు. ఇది రెగ్యులర్ కార్యక్రమం. కొత్తగా సాంక్షన్ చేసి ఇస్తలేం పాతదే. కొనసాగింపు అని చెప్తే ఒక రోజు టైం ఇచ్చారు ఎలక్షన్ కమిషన్. నిన్న మళ్ల కాంగ్రెస్ మళ్ల ఢిల్లీకి పోయి సికాయత్ చేసి మళ్ల రైతుబంధు ఆపేశారు. రైతుబంధు ఆపితే వాళ్లకు ఓట్లు వస్తాయని అనుకుంటున్నరు. ఎవడో యెన్కట చెప్పిండు. తొండ బిర్రు యాన్దాకా అంటే ఏనుగుల దాకా అని. ఎన్ని రోజులు ఆపుతావ్ నువ్వు. మూడో తారీఖు ఓట్లు లెక్కపెడితే మళ్ల మన గవర్నమెంటే వస్తుంది. బ్రహ్మాండంగా ఆరో తారీఖు నుంచి సంతోషంగా ఇచ్చుకుంటాం ఎవరి మోతాదు లేకుండా అని కేసీఆర్ స్పష్టం చేశారు.
తెలంగాణ రైతులు రంది పడాల్సిన అవసరం లేదు..
చేవెళ్ల నుంచి తెలంగాణ రైతులకు తెలియజేస్తున్నా. మీరేం రంది పడాల్సిన అవసరం లేదు. మళ్ల వచ్చేది మన గవర్నమెంటే. ఈ దుష్ట దుర్మార్గ కాంగ్రెస్ ఆపినా.. వాళ్ల శక్తి అంతా మూడో తారీఖు వరకే. ఆరో తేదీ నుంచి రైతుబంధు యథావిధిగా వస్తది ఏం బాధపడొద్దని చెబుతున్నా. అంటే గీంత నీచంగా ఆలోచిస్తరు. రైతుబంధు కొత్తది కాదు కదా..? ఆరేడు ఏండ్ల నుంచి ఇస్తున్నం. అది రెగ్యలర్ కార్యక్రమం. కొత్తగా సాంక్షన్ చేయలేదు. దాన్ని కూడా ఆపితే మనకు లాభం జరుగుతదేమో అని కాంగ్రెసోళ్లు ఆలోచిస్తున్నారు అని కేసీఆర్ మండిపడ్డారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Patlolla karthik Reddy | డైరెక్టుగా గెజిట్ వచ్చింది.. సీఎంకు సంబంధం లేదంటే నమ్ముదామా..? : పట్లోళ్ల కార్తీక్ రెడ్డి
Raptadu Incident | రాప్తాడు ఘటనపై ఏపీ ప్రభుత్వం సీరియస్..బాధితురాలి తల్లితో ఫోన్లో మాట్లాడిన చంద్రబాబు
Patriot Missiles: ఉక్రెయిన్‌కు 500 పేట్రియాట్ మిస్సైళ్లు: అమెరికా
ఎమ్మెల్సీ ఓటు నమోదులో పాల్గొన్న కంచర్ల రామకృష్ణారెడ్డి
‘మాదక ద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

