CM KCR | మహబూబ్‌నగర్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో నాటి కరువును తలుచుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. మనషులే కాదు.. మహబూబ్‌నగర్ చెట్లు కూడా బక్క పడిపోయాయని బాధ పడ్డామని కేసీఆర్ గుర్తు చేశారు. అనేక సందర్భాల్లో కన్నీళ్లు పెట్టకున్నామని కేసీఆర్ తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు.
మమబూబ్‌నగర్ జిల్లా విషయానికి వస్తే.. గత ఉద్యమ సందర్భంలో ఏ మూలకు పోయినా, ఏ ప్రాంతానికి పోయినా, ఎప్పుడు కూడా నేను దుఃఖంతో పోయేదని కేసీఆర్ గుర్తు చేశారు. కండ్లలో నీళ్లు వచ్చేవి. మహబూబ్‌నగర్ దరిద్రం పోవాలంటే ఎంపీగా పోటీ చేయాలని జయశంకర్ చెప్పారు. నేను ఇదే జిల్లా నుంచి పోటీ చేశాను. లక్ష్మారెడ్డి ముందుండి ఆ పార్లమెంట్ ఎన్నిక తన భుజాల మీద వేసుకుని ఎంపీగా గెలిపించారు. ఏ రోజుకైనా మహబూబ్‌నగర్ చరిత్రలో ఒక కీర్తి శాశ్వతంగా ఉంటుంది. పదిహేను ఏండ్లు పోరాటం చేసినప్పటికీ ఎంపీగా ఉంటూనే తెలంగాణ సాధించిన విషయం కూడా చిరస్థాయిగా ఉంటుంది. ఒకనాడు జయశంకర్ నేను నారాయణపేట నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు నవాబ్‌పేట అడవీ మీదుగా మహబూబ్‌నగర్ వస్తున్నాం. లైట్ల వెలుతురులో కనబడే చెట్లను చూసి మేం అనుకున్నాం. మనషులు కాదు చివరకు మభహబూబ్‌నగర్ చెట్లు కూడా బక్కపడిపోయాయని అనుకుని బాధపడ్డాం. ఒక్క గోస కాదు పాలమూరుది. అనక సందర్భాల్లలో కండ్లకు నీళ్లు వచ్చేవి. నడిగడ్డకు పోయినా నాడు కూడా ఏడ్సినం అని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
గంజి కేంద్రాలు, అంబలి కేంద్రాలు పెడుతుంటే గుండెల్లో బాధ కలిగేది అని కేసీఆర్ పేర్కొన్నారు. కృష్ణా పక్కనే పారుతున్నా.. ముఖ్యమంత్రులు రావడం, దత్తత తీసుకోవడం, శిలాఫలకాలు వేయడం తప్ప ఏం లాభం జరగలేదు. ఉద్యమంలో నేనే పాట రాసినా.. పక్కన కృష్ణమ్మ ఉన్న ఫలితమేమి లేకపాయే పాలమూరు, నల్లగొండ, ఖమ్మం మెట్టు పంటలు ఎండే అని పాట కూడా రాశాను. మీ అందరికి తెలుసు. మహబూబ్‌బ్‌నగర్ నా గుండెల్లో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ దుఃఖం, బాధ పేదరికం ఉన్నది. ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష్మారెడ్డి మంత్రి అయ్యారు. చాలా పనులు చేశారు. ఇవాళ రాష్ట్రంలోని డయాగ్నోస్టిక్ సెంటర్లు ఆయన పుణ్యమే అని కేసీఆర్ తెలిపారు.