BRS Leader Dasoju Sravan | హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టమని కేంద్రం చెప్పినా సీఎం కేసీఆర్ మీటర్లు పెట్టను అని ఇన్నాళ్లుగా చెప్పిన మాటలు నిజమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ చెప్పినందుకు బీఆర్ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ ధన్యవాదాలు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలను పాల్పడిందని, ఢిల్లీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు కేసీఆర్ తలొగ్గలేదని, కేసీఆర్కు రైతులే ముఖ్యమని, వారి ప్రయోజనాలే ముఖ్యమని స్పష్టం చేశారని దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. మరో వైపు కాంగ్రెస్ పార్టీ మూడు గంటలే వ్యవసాయానికి ఇస్తామని చెపుతుందని, రైతుల ప్రయోజనాలకు ఈ రెండు రాజకీయ పార్టీలను తరిమికొట్టి మరో సారి కేసీఆర్ను సీఎంగా ఎన్నుకుందామని శ్రవణ్ పిలుపునిచ్చారు.