హైదరాబాద్ : వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ తీసుకున్న క్యాబినెట్ నిర్ణయంపై వీఆర్ఏ(VRA)లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్(CM KCR )కు రుణపడి ఉంటామని శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా సీఎం కేసీఆర్చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
మహబూబాబాద్(Mahaboobabad) జిల్లా కేంద్రంలోని తహసీల్ కార్యాలయంలో వీఆర్ఏలు సీఎం చిత్రపటానికి పాలతో అభిషేకం చేసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. సిద్దిపేట జిల్లాలో సీఎం కేసీఆర్(CM KCR), మంత్రి హరీష్ రావు(Minister Harish Rao) చిత్రపటాలకు , ఆదిలాబాద్, సుల్తానాబాద్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 23 వేల మంది వీఆర్ఏలకు లబ్ధి జరుగనుందని వీఆర్ఏ సంఘం నాయకులు పేర్కొన్నారు. దశాబ్ది వేడుకల సందర్భంగా తమ కుటుంబాలకు శుభవార్త చెప్పడం సంతోషంగా ఉందని వెల్లడించారు.