కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ (Gampa Govardhan) కుమారుని వివాహానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. అయితే ఈ సందర్భంగా వివాహ వేదిక వద్దకు సీఎం కేసీఆర్ చేరుకోగానే.. కామారెడ్డి నియోజక వర్గ ప్రజలు, యువత హర్షాతిరేకాలతో కేరింతలతో ముఖ్యమంత్రికి స్వాగత నినాదాలు పలికారు.
‘సీఎం కేసీఆర్ రావాలి’.. ‘స్వాగతం కామారెడ్డికి సుస్వాగతం’, ‘కేసీఆర్ రావాలి కేసీఆర్ కావాలి’, ‘జై కేసీఆర్.. దేశ్ కీ నేత కేసిఆర్’, అనే నినాదాలతో వివాహ వేదిక దద్దరిల్లింది. కరచాలనం చేస్తూ, ఫొటోలకు అవకాశమిస్తూ, దారి పొడవునా అభిమానులకు పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ బీఆర్ఎస్ అధినేత ముందుకు సాగారు.