CM KCR | వికారాబాద్ : మెతుకు ఆనంద్ గర్వం లేని మనిషి.. నిగర్వి, నిత్యం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, మెతుకు ఆనంద్‌కు మద్దతుగా ప్రసంగించారు.
మెతుకు ఆనంద్ ఇక్కడే ధరూర్ మండలంలో పుట్టిన వ్యక్తి. సామాన్య కుటుంబంలో పుట్టి, కష్టపడి చదువుకుని డాక్టర్ అయిన వ్యక్తి. మీ అందరికి తెలుసు. ఆయన భార్య సబిత కూడా డాక్టరే. ఇద్దరు ఇక్కడే ఉండి ప్రజా సేవలో ఉంటారు. వాళ్లు ఎవరి తెరుగు పోరు. నిగర్వి, గర్వం లేని మనిషి. అందరిలో కలిసి ఉండి గ్రామాలు తిరిగి వీలైనంత వరకు తనకు దేవుడిచ్చిన శక్తిని ఉపయోగించి ప్రజలకు సేవ చేయాలని ఆలోచించే వ్యక్తి. వికారాబాద్ బాగుపడతది ఆయన గెలిస్తే. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తడో హైదరాబాద్‌లో అదే గవర్నమెంట్ వస్తది. ఎవరి చేతిలో ఉంటే ఈ రాష్ట్రం బాగుంటది. ధరణి ఊడగొడుతాం. రైతుబంధు తప్పు, 3 గంటల కరెంట్ ఇస్తం అనేటోళ్లు కరెక్టా..? లేదు అన్ని విధాలా మీ వెంట ఉంటాం అని చెప్పెటోళ్లు కరెక్టా..? మీరు ఆలోచించాలి అని కేసీఆర్ సూచించారు.
10 హెచ్‌పీ మోటారు పెడుతామని, బాధ్యతరాహిత్యంగా మాట్లాడుతున్నారు కాంగ్రెసోళ్లు. 10 హెచ్‌పీ మోటార్లు పెట్టి, అందరూ ఒకటేసారి వత్తుతే ట్రాన్స్ ఫార్మలు ఉంటాయా..? పటాకులు పేలినట్లు పేలిపోతాయి. సబ్ స్టేషన్లు కూడా పేలిపోతాయి. కాంగ్రెస్ గెలిస్తే గ్యారెంటీగా మళ్ల చీకటి రాజ్యమే వస్తది. కర్ణాటక మీకు దగ్గరనే ఉంటది. అక్కడ కరెంట్ 20 గంటలు ఇస్తమని నరికారు.. కానీ ఐదు గంటలు కరెంట్ ఇస్తున్నరు. హైదరాబాద్‌కు వచ్చి వాళ్లు ధర్నా చేస్తున్నారు. మేం కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయాం. మీరు కూడా మోసపోవద్దని కర్ణాటక రైతులు చెబుతున్నారు. కాబట్టి దచయేసి విద్యావంతుడు, బుద్ధిమంతుడు, నాకు దగ్గరి మనిషి ఆనంద్‌ను గెలిపించాలని కోరతున్నా అని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు.