హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు కార్యక్రమంలో ఆ ఇద్దరు తప్ప మిగతా అతిథులంతా జై తెలంగాణ అంటూ నినదించారు. మంగళవారం జరిగిన సమ్మిట్ ముగింపు సమావేశంలో ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, సినీనటుడు పద్మవిభూషణ్ చిరంజీవి, పారిశ్రామిక దిగ్గజం ఆనంద్ మహీంద్రా హాజరయ్యారు. ఇదే వేదికపై సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సైతం ఆసీనులయ్యారు. దువ్వూరి సుబ్బారావు, చిరంజీవి, ఆనంద్ మహీంద్రా సహా పలువురు ‘జై తెలంగాణ’ అంటూ తమ ప్రసంగాన్ని ముగించారు. కానీ సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క జై తెలంగాణ అని నినదించకపోవడంపై తెలంగాణ వాదులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : గ్లోబల్ సమ్మిట్లో ఒప్పందాల సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులకు చేదు అనుభవం ఎదు రైంది. వారి పట్ల ప్రభుత్వం అవమానకరంగా వ్యవహ రించినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఒప్పందాల కోసం సీఎం రేవంత్రెడ్డి చాంబర్ ముందు వారు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. వచ్చిన కొద్ది కంపెనీలు, చిన్నాచితక కంపె నీలకు కూడా సీఎం రేవంత్రెడ్డి షెడ్యూల్ ప్రకారం సమయం ఇవ్వలేదని తెలి సింది. పలు కంపెనీల ప్రతినిధులను ప్రభుత్వంతో ఒప్పందం కోసం సంబంధిత శాఖ అధికారులు వారిని మంగళవారం మధ్యాహ్నం సీఎం రేవంత్రెడ్డి వద్దకు తీసుకెళ్లారు. కానీ అప్పటికే సీఎం రేవంత్రెడ్డి సినిమా వాళ్లతో, ఇతర నేతలతో భేటీ అయ్యారు. దీంతో ఎంవోయూల కోసం వచ్చిన కంపెనీల ప్రతినిధులను సీఎం చాంబర్ ముందే నిలిపేశారు. ఈ విధంగా సుమారు 45 నిమిషాల పాటు వారిని అక్కడే నిలబెట్టినట్టు ఓ శాఖకు చెందిన అధికారులు తెలిపారు.