వరంగల్, జూన్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రామప్ప చెరువు ద్వీపంలో సాస్కీ పథకం కింద తాము చేపట్టిన పనులతో నంది శిల్పానికి ఎటువంటి నష్టం వా టిల్లలేదని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ (టీజీటీడీసీ) పేర్కొన్నది. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేటలోని రామప్ప చెరువు ద్వీపంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ఆ పనుల ప్రాంగణానికి కొద్ది దూరంలో విరిగిపడిన నంది విగ్ర హం, పానవట్టం తదితర శిల్ప సౌందర్య దుస్థితిపై సోమవారం ‘నమస్తే తెలంగాణ’లో ‘చారిత్రక రామప్పలో విధ్వంసం’ శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనిపై టీజీటీడీసీ వివరణ ఇచ్చింది. రామ ప్ప ద్వీపం మొత్తం విస్తీర్ణం సుమారు 8 ఎకరాలని, కేంద్ర ప్రభుత్వ పర్యాటక మంత్రి త్వ శాఖకు చెందిన రాష్ట్రాలకు మూలధన పెట్టుబడుల కోసం ప్రత్యేక సహాయం (సాస్కీ) పథకం కింద, తాము కేవలం 5 ఎకరాల విస్తీర్ణంలో మాత్రమే అభివృద్ధి ప నులు చేపట్టినట్టు టీజీటీడీసీ స్పష్టం చేసిం ది. ఆ 5 ఎకరాల ప్రాంతంలో జరిగే పనులే తమ పరిధిలోకి వస్తాయని పేర్కొంది. నంది శిల్పం ఉన్న ప్రాంతంలో దేవాదుల పైప్లైన్ వెళ్తుందని, ఈ నేపథ్యంలో తాము మాత్రం నంది శిల్పానికి ఎటువంటి నష్టాన్ని కలిగించలేదని వివరించింది.