CJI | ఉస్మానియా యూనివర్సిటీ : భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఈ నెల 12న ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు. మధ్యాహ్నం మూడున్నర గంటలకు ఠాగూర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న కార్యక్రమంలో ”భారత రాజ్యాంగం: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సహకారం” అనే అంశంపై ఆయన ప్రసంగించనున్నారు. విద్యార్థులకు రాజ్యాంగంలోని కీలకమైన అంశాలను అవగాహన చేసుకునేందుకు ఈ ఉపన్యాసం తోడ్పడుతుందని అధికారులు అభిప్రాయపడ్డారు.