హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలన హామీతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని పౌరహక్కుల సంఘం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ధన్వాడలో పోలీసుల దాడిలో గాయపడిన వారిని పరామర్శించడానికి బుధవారం పౌరహకుల సంఘం రాష్ట్ర కమిటీ నేతలు వెళ్తుండగా..
ఎర్రవల్లి చౌరస్తాలో అదుపులోకి తీసుకుని ఇటిక్యాల పోలీస్స్టేషన్లో గంటల తరబడి నిర్బంధించినట్టు పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ లక్ష్మణ్ గడ్డం, నేతలు నారాయణరావు, సుభాన్ తదితరులు ఉన్నారు.