రామన్నపేట, సెప్టెంబర్ 3: కేసీఆర్‌పై సీబీఐ విచారణ సిగ్గుచేటని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేం ద్రంలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన భారీ ర్యాలీ నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి జ్ఞానోదయం కలగాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. అనంతరం సుభాష్ సెంటర్లో రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
దీంతో వారు చిట్యాల- భువనగిరి రహదారిపై బైఠాయించ గా వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా లింగయ్య మాట్లాడుతూ కేసీఆర్‌పై కుట్రలను రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రైతులకు యూరియా ఇవ్వలేని దద్దమ్మ రేవంత్‌రెడ్డి అని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన రెండేండ్లలోనే వేల కోట్లను దోచుకున్నారని, తొలుత వారిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పోశబోయిన మల్లేశం, మాజీ ఎంపీపీ నీల దయాకర్, మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ కంభంపాటి శ్రీనివాస్, రైతుబంధు సమితి మాజీ మండల అధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, మాజీ ఎంపీటీసీలు సాల్వేరు అశోక్, వేమవరపు సుధీర్‌బాబు, దోమల సతీశ్, మాజీ సర్పంచ్‌లు కోళ్లస్వామి, బందెల యాదయ్య, నాయకులు కన్నెబోయిన బలరాం పాల్గొన్నారు.