ఏపీకి నీళ్లు పారించి యాగంతో మోసం
ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి ఏజెంట్‌గా మారి తెలంగాణ కంటే ఆంధ్రా ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు.
- సాగర్ డెడ్‌స్టోరేజీకి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం: చిరుమర్తి లింగయ్య
నకిరేకల్, ఆగస్టు 11 : ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్‌రెడ్డి ఏజెంట్‌గా మారి తెలంగాణ కంటే ఆంధ్రా ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు. మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా నకిరేకల్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో మీడియాతో మా ట్లాడారు. శ్రీశైలంలో ఉన్న నీళ్లు ఆంధ్రాకు వ దిలేసి వరుణయాగం పేరుతో రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. శ్రీశైలం విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం నుంచి కరెంటును ఉత్పత్తి చేస్తూ ఆ నీటిని నా గార్జునసాగర్కు తరలించే అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని దు య్యబట్టారు. 875 అడుగుల నీరు శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నా కరెంటు ఉత్పత్తి చేయకపోవడంలో ఆంతర్యమేందో చెప్పాలని డిమాం డ్ చేశారు.
కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే అక్కసుతో కాళేశ్వరం నుంచి నీళ్లను ఎత్తిపోయకుండా రేవంత్‌రెడ్డి కుట్రలు చేస్తున్నాడని విమర్శించారు. ప్రజా వ్యతిరేకత వస్తుందనే కారణంతోనే వరుణ యాగం పేరుతో డ్రా మాలు చేస్తున్నాడని మండిపడ్డారు. శైలం నుంచి పోతిరెడ్డిపాడుతోపాటు ఇతర కాలువల ద్వారా ఏపీకి నీళ్లు తరలించుకుపోతున్నా సీఎం రేవంత్‌రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. సాగర్‌కు నీటి తరలింపుపై ప్రభుత్వం దృష్టి పెట్టకపోతే సాగర్ ఆయకట్టుకు ప్రభు త్వం తెచ్చిన కరువే శాపంగా మారనున్నదని అన్నారు. సాగర్ ఎడమకాలువ ఆయకట్టుతోపాటు ఏఎమ్మార్పీ ఆయకట్టు రైతులను కూడగట్టి ప్రభుత్వంపై పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

