ధర్మసాగర్(వేలేరు) ఆగస్టు 15 : డెంగ్యూతో ఓ చిన్నారి మృతి చెందిన ఘటన హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. వేలేరుకు చెందిన సూత్రపు రమేశ్ కూతురు శాన్వి(7)కి మూడు రోజుల క్రితం జ్వరం రాగా, కుటుంబసభ్యులు హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్చారు.
వైద్యులు పరీక్షలు నిర్వహించి డెంగ్యూ సోకిందని నిర్ధారించారు. చికిత్స అందిస్తుండగా శుక్రవారం చిన్నారి మృతిచెందింది. శాన్వికి మాజీ ఎమ్మెల్యే రాజయ్య నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు.