హైదరాబాద్, మార్చి24(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 40వసారి ఢిల్లీకి వెళ్లారు. సోమవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డితోకలిసి సీఎం ఢిల్లీ వెళ్లారు. ఈసారి పర్యటన మంత్రివర్గ విస్తరణ కోసమేనని గాంధీ భవన్ వర్గాలు మీడియాకు లీకులు ఇచ్చాయి. మంత్రివర్గ విస్తరణపై ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు, సంప్రదింపులు జరిపిన అధిష్ఠానం ఈ సారి తుది నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది.
సీఎం జపాన్ పర్యటన ఖరారు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జపాన్ పర్యటన ఖరారైంది. ఏప్రిల్ రెండో వారంలో సీఎం రేవంత్రెడ్డి వారం రోజుల పాటు జపాన్లో పర్యటించనున్నారు.