సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకుంటాం
పలు ప్రాంతాలు, భాషలు, మతాలు, సంసృతి సంప్రదాయాలతో కూడి, భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లే భారతదేశ సమైక్యతను, రాజ్యాంగం అందించిన లౌకికవాద, సమాఖ్యవాద స్ఫూర్తిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు.
- రాజ్యాంగం వల్లనే తెలంగాణ ఆవిర్భావం
- అందుకే సచివాలయానికి అంబేద్కర్ పేరు
- రాజ్యాంగ స్ఫూర్తితోనే సంక్షేమ పథకాలు
- సీఎం కేసీఆర్ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): పలు ప్రాంతాలు, భాషలు, మతాలు, సంసృతి సంప్రదాయాలతో కూడి, భిన్నత్వంలో ఏకత్వం పరిఢవిల్లే భారతదేశ సమైక్యతను, రాజ్యాంగం అందించిన లౌకికవాద, సమాఖ్యవాద స్ఫూర్తిని కాపాడేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శనివారం ఒక ప్రకటనలో ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. మహనీయుడు, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేదర్ రూపొందించిన భారత రాజ్యాంగం.. కుల, మత, వర్గ, వర్ణ, ప్రాంత వివక్షకు అతీతంగా, దేశ పౌరులందరినీ సమానంగా పరిగణిస్తుందని సీఎం పేర్కొన్నారు.
ప్రపంచ లిఖిత రాజ్యాంగాలలో భారత రాజ్యాంగానిది ప్రథమ స్థానమని సీఎం శ్లాఘించారు. మనుషులందరూ సమానమనే విశ్వమానవ సమానత్వ సిద్ధాంతాన్ని భారత రాజ్యాంగం ప్రతిఫలిస్తుందని సీఎం అభివర్ణించారు. సమాఖ్యస్ఫూర్తిని బలోపేతం చేసే దిశగా, రాజ్యాంగం ద్వారా అంబేదర్ అందించిన ఆర్టికల్-3ను అనుసరించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. అంబేదర్ స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం పాలన కొనసాగిస్తున్నదని సీఎం వెల్లడించారు.
ఆ మహనీయుని పేరును తెలంగాణ సచివాలయానికి నామకరణం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఘన నివాళి అర్పించిందని గుర్తుచేశారు. దేశంలోనే ఎకడా లేనివిధంగా హైదరాబాద్‌లో 125 అడుగుల ఎత్తయిన అంబేదర్ కాంస్య విగ్రహాన్ని నెలకొల్పుతున్నామని తెలిపారు. తెలంగాణలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, మహిళా వర్గాలు, పేదల సాధికారత, ఆత్మగౌరవం కోసం పలు పథకాలను రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలుచేస్తూ దేశానికి ఆదర్శంగా నిలవడంలో రాజ్యాంగ స్ఫూర్తి ఇమిడి వున్నదని సీఎం పేర్కొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

