హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ): చేవెళ్ల డిక్లరేషన్లో భాగంగా గిరిజనులకు ఇచ్చిన ప్రతీ హామీని తక్షణం అమలు చేయాలని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్నాయక్ డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధన కోసం ఈనెల 26వ తేదీన ఇందిరా పార్ వద్ద నిర్వహించే మహాధర్నాకు తరలిరావాలని కోరారు. ఈమేరకు శనివారం రాంబల్నాయక్ ఓ ప్రకటన విడుదల చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో గిరిజనులకు ఎంతో లబ్ధి చేకూరిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేవేళ్ల డిక్లరేషన్ పేరిట 12 హామీలు ఇచ్చి ఏ ఒక్కటికూడా అమలు చేయడం లేదని నిప్పులు చెరిగారు.