Chennur | రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి, మంత్రి వివేక్ వెంకటస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. చెన్నూరు నియోజకవర్గానికి చెందిన ఉమ్మడి ఆదిలాబాద్ జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి కాంగ్రెస్‌ను వీడుతున్నారు. వెయ్యి మందికిపైగా అనుచరులతో కలిసి ఆయన బీఆర్ఎస్లో చేరనున్నారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో తన అనుచరులతో కలిసి రాజిరెడ్డి గులాబీ కండువా కప్పుకోనున్నారు. దీనికోసం చెన్నూరు నియోజకవర్గం నుంచి హైదరాబాద్‌కు తన అనుచరులతో కలిసి వందలాది వాహనాల్లో హైదరాబాద్‌కు బయల్దేరారు. కాసేపట్లో తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమంలో ఆయన బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.
మున్సిపల్ ఎన్నికల ముందు చెన్నూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి, మంత్రి వివేక్‌కు షాక్!
ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ భవన్లో జరిగే కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి సమక్షంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి గారు పార్టీలో… pic.twitter.com/4qbdNPi8Rx
— BRS Party (@BRSparty) January 21, 2026