హుజూరాబాద్ టౌన్, అక్టోబర్ 12: పేదింటి బిడ్డ గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌కు పేదల బాధలు తెలుసని, ఆయన గెలుపుతో హుజూరాబాద్‌లో మార్పు వస్తుందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం హుజూరాబాద్ పట్టణంలోని 22వ వార్డు కాకతీయకాలనీలో గెల్లుతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల దశాబ్దాల స్వరాష్ట్ర కల నెరవేర్చిన సీఎం కేసీఆర్.. వినూత్న పథకాలను ప్రవేశపెట్టి దేశానికే ఆదర్శంగా నిలిపారని తెలిపారు. అర్హులందరికీ ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా కృషిచేస్తున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ సర్కారే అని స్పష్టంచేశారు. అభివృద్ధిని, సంక్షేమాన్ని కోరుకునే ప్రజలు కారు గుర్తుకు ఓటు వేసి గెల్లును గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.