హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తేతెలంగాణ) : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలంగాణపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దేశ రాజధానిలో హైదరాబాద్ నగరాన్ని అవమానించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిల ప్రచారంలో పాల్గొన్న బాబు.. హైదరాబాద్ స్థాయిని దిగజార్చారు. 1995 నాటికి హైదరాబాద్ పాడుబడినట్టు ఉండేదని చెప్పారు. ఢిల్లీలో తెలుగు ప్రజలు అధికంగా ఉండే షహదరా ప్రాంతంలో బీజేపీ తరపున ఆయన ఎన్నికల ప్రచారం 10వ పేజీలోచేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఢిల్లీకి వస్తే చాలా బాధగా ఉన్నదని, ఎప్పుడో 1995లో పాడుబడిపోయిన హైదరాబాద్ మాదిరిగా ఢిల్లీ తయారైందని అన్నారు. ఢిల్లీ అలా అ వ్వడానికి కారణం ఎవరు? పదేండ్లు ఎవరు పరిపాలించారు అని ప్రశ్నించా రు. ఈ పదేండ్లు డబుల్ ఇంజిన్ సర్కా ర్ అధికారంలోకి వచ్చి ఉంటే వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్‌ను తలదన్నేలా ఢిల్లీ తయారయ్యేదని చెప్పుకొచ్చారు. బాబు వ్యాఖ్యలపై తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో భగ్గుమంటున్నా రు. చంద్రబాబు అంత చెత్త పొలిటీషియన్ దేశంలోనే ఎక్కడా లేడని మండిపడుతున్నారు. బాబు రాజకీయాల్లోకి రాకపోయుంటే తెలుగు రాష్ట్రాలు ఎంతో అభివృద్ధి చెందేవని కామెంట్లు పెట్టారు. చంద్రబాబు కంటే ముందే హైదరాబాద్‌కు వందల ఏండ్ల గొప్ప చరిత్ర ఉన్నదని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు తెలంగాణపై ఆయనకు ఉన్న వ్యతిరేకతను వెల్లడిస్తున్నాయని ఎక్స్ వేదికగా నెటిజన్లు విమర్శిస్తున్నారు.