హైదరాబాద్, అక్టోబర్ 23 (నమస్తే తెలంగాణ): పెండింగ్ బిల్లులు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని తాజా మాజీ సర్పంచ్‌లు పోరుబాట తలపెట్టారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడి నుంచి వచ్చేనెల 4న ‘చలో హైదరాబాద్ పోరుబాట’ కార్యక్రమాన్ని చేపడతామని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్ చెప్పారు. పోరుబాట వాల్‌పోస్టర్‌ను బుధవారం హైదరాబాద్‌లో వి డుదల చేశారు. జేఏసీ ఉపాధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, కోశాధికారి నవీన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు