హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ) : లగచర్ల ఘటనలో అమాయక గిరిజన రైతులను బలిచెయ్యొద్దని, లగచర్ల ఘటనపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు పూర్తి నివేదిక అందజేయాలని, పొలీస్ హింసకు గురైన బాధితులకు తక్షణం వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని వికారాబాద్ జిల్లా కలెక్టర్, ఎస్పీలను రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బకి వెంకటయ్య ఆదేశించారు.
బాధిత రైతులు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్‌ను కలిసి తమ వ్వవసాయ భూములను బలవంతంగా గుంజుకుంటున్నారని, కలెక్టర్‌పై దాడి సాకుతో పోలీసులు అమాయక రైతులను అరెస్టు చేస్తూ వేధిస్తున్నారని ఫిర్యాదు చేయగా ఆయన స్పందించారు. ఆదివారం కలెక్టర్, ఎస్పీలకు ఫోన్ చేసి లగచర్ల ఘటనపై చైర్మన్ బకి వెంకటయ్య ఆరా తీశారు.