TREI-RB | హైదరాబాద్ : గురుకులాల్లో మ్యూజిక్ టీచర్ల పోస్టులకు సంబంధించిన అభ్యర్థులకు 23న సర్టిఫికెట్ వెరిఫికేషన్‌ను నిర్వహించనున్నారు. ఈ మేరకు ట్రిబ్ చైర్మన్ బడుగు సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. మాసాబ్ ట్యాంక్‌లోని డీఎస్ఎస్ భవన్లో సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కొనసాగుతుందని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికేట్స్‌తో హాజరు కావాలని, అభ్యర్థులు https://treirb.cgg.gov.in లో షెడ్యూల్ చూసుకోవాలని సూచించారు.