తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కొర్రీలు పెడుతున్నదని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. కేంద్రానికి రైతులపై కనీస సానుభూతిలేదని అన్నారు. తాము చర్చలకు వెళ్లినపుడు నూకలు తినండి అని, తెలంగాణ ప్రజలకు నూకలు తినడం అలవాటు చేయండని సాక్షాత్తు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అవమానకరంగా మాట్లాడడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు జవాబు చెప్పాలన్నారు. కేంద్రంలోని బీజేపీ సరారు రైతుల ఆందోళనలతో నల్లచట్టాలను వెనకు తీసుకొన్నదని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ రైతులకు క్షమాపణ చెప్తూ చెంపలేసుకున్నాడని గుర్తుచేశారు.
‘నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు.. రైతులు పండించే పంటలకు కనీస మద్దతు దకాలని, దీనికోసం చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆనాటి ప్రధానమంత్రికి ప్రతిపాదనలు కూడా పంపించారు. ఇప్పుడు ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీనే ఉన్నారు. కానీ ఆయన నాడు పంపించిన ఫైలు ఇప్పటికీ ప్రధానమంత్రి కార్యాలయంలోనే ఉన్నది’ అని నిరంజన్‌రెడ్డి గుర్తుచేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలన్న డిమాండ్‌పై కూడా కేంద్రం నుంచి సానుకూల స్పందన లేదన్నారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని చెప్పారని, కానీ, అదీ అమలు కాలేదని అన్నారు. బీజేపీ సరారు ద్వంద్వ వైఖరిపై పోరాటం కొనసాగుతూనే ఉంటుందని చెప్పారు.