హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): తాడిచెర్ల -2 కోల్‌బ్లాక్‌ను సింగరేణికి కేటాయించామన్న కేంద్ర బొగ్గుశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి ప్రకటనను రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తప్పుబట్టారు. 2013 సెప్టెంబర్ 16లోనే ఈ బ్లాక్‌ను కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించిందని తెలిపారు. వాస్తవాలిలా ఉంటే కొత్తగా మీరిచ్చిందేముందని కిషన్‌రెడ్డిని భట్టి ప్రశ్నించారు.
బుధవారం బేగంపేటలోని ప్రజాభవన్‌లో భట్టి మీడియాతో మాట్లాడుతూ వాస్తవాలను విస్మరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కిషన్‌రెడ్డికి సింగరేణిపై ప్రేముంటే గోదావరి లోయ బ్లాకులన్నీ సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు.